![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -382 లో.. మధు ఏదో స్క్రిప్ట్ రాస్తంటాడు. తన దగ్గరకి నందు వచ్చి అటపట్టిస్తుంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి.. అందరిని హాల్లోకి పిలుస్తుంది. ఏంటని రేవతి అడుగుతుంది. మీకు అందరికి ఒక సర్ ప్రైజ్ అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత వెళ్లి.. రెండు రింగ్స్ తీసుకొని వచ్చి నేను ముకుంద ఆదర్శ్ లా పెళ్లి చూడలేదు కదా.. అందుకే ఇప్పుడు వీళ్ళు రింగ్స్ మార్చుకుంటారని కృష్ణ అనగానే ముకుంద షాక్ అవుతుంది.
ముకుందకి ఇంట్రస్ట్ గా లేనట్టు ఉందని మధు అంటాడు. కృష్ణ ఇద్దరికి రింగ్స్ ఇస్తుంది. ముకుందకి ఆదర్శ్ రింగ్ తొడగబోతుంటే.. ముకుంద తన చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. నేను చెప్పాను కదా తనకి ఇష్టం లేదని మధు అంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ముకుంద అనుకుంటుంది. నువ్వు ఆపు.. ప్రతిసారీ ఇష్టం లేదని అంటావని మధుపై ముకుంద కోప్పడుతుంది. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది చూస్తే అలాగే అనిపిస్తుందని మధు అనగానే.. వేరే కారణం ఉండొచ్చు కదా.. మా కోసం కృష్ణ ఈ రింగ్స్ తీసుకొని వచ్చింది కానీ అభిమానంతో నేను ఈ రింగ్స్ కృష్ణ, మురారిలకి ఇస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు రింగ్స్ మార్చుకుంటారని ముకుంద అంటుంది. వెంటనే కావాలంటే వాళ్ళకి వేరే తెప్పిస్తాం కానీ మీరు ఇవి మార్చుకోండి అని మధు అంటాడు. కానీ ముకుంద తెలివిగా ఆదర్శ చేత రింగ్ తొడిగించుకోకుండా తప్పించుకుంటుంది. నేను తప్పుగా మాట్లాడితే.. పెద్దత్తయ్య ఏదో ఒకటి అనేవారు కదా ఏం అనట్లేదంటే.. నేను చెప్పింది కరెక్ట్ అనే కదా అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీలు ఆ రింగ్ మార్చుకుంటారు. కానీ మధుకి మాత్రం ముకుందకి ఇదంతా ఇష్టం లేకనే ఇలా చేసిందని అనుకుంటాడు.
ఆ తర్వాత ముకుంద చాలా మారిపోయిందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నేను కృష్ణని మోసం చెయ్యలేక ఆదర్శ్ కి న్యాయం చెయలేకపోతున్నానని ముకుంద అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి ఆదర్శ్ వస్తాడు. సారీ నిన్ను హర్ట్ చేశానని ముకుంద అనగానే.. లేదు నువ్వు చాలా మంచి పని చేసావ్.. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టమని ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అది చూసి ముకుంద తనని మోసం చేస్తున్నానని ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రేవతి డల్ గా ఉంటుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు రేవతి దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతారు. శోభనం ముహూర్తం పెట్టిద్దాం అక్క అని అడిగితే.. ఇప్పుడే ఆదర్శ్, ముకుందలకి వద్దు కావాలంటే కృష్ణ మురారిలకి పెట్టుకోమని భవాని అక్క అంటుందని వాళ్ళకి రేవతి చెప్తుంది. ఆ తర్వాత రేవతి, కృష్ణ ఇద్దరు వెళ్లి నిజంగా ముకుంద మారిపోయిందని భవానికి చెప్తారు. వాళ్ళు ఎప్పటికి సంతోషంగా ఉండాలని నేను వాళ్ళకి ఇప్పుడు శోభనం వద్దని అంటున్నా కావాలంటే.. మీకు ముహూర్తం పెట్టించమను అని భవాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |